యర్రగొండపాలెం: త్రిపురాంతకం లో ఓ కుక్క పిల్లతో వానరాలు ఆప్యాయంగా ఆటలాడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలో ఓ కుక్క వానరాలు ఆప్యాయంగా ఆటలాడుతూ కనిపించాయి. సాధారణంగా శునకాలు వానరాలు ఎదురుపడితే పోట్లాడుకుంటాయి. ఒకదానిపై ఒకటి పడి రక్కేసుకుంటాయి. కానీ ఆదివారం అందుకు భిన్నమైన దృశ్యాలు కనపడ్డాయి. స్థానికులు కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంపడంతో వైరల్ గా మారాయి.