దర్శి: కురిచేడు మండలం పడమర వీరాయపాలెం గ్రామంలో ప్లెక్సీల చించివేత పై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక టిడిపి నాయకులు
Darsi, Prakasam | May 12, 2026 ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర వీరాయపాలెం గ్రామంలో సోమవారం దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పుట్టినరోజు సందర్భంగా స్థానిక నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే అర్ధరాత్రి ఫ్లెక్సీలను చించి వేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటనపై టిడిపి నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షపూరిత రాజకీయాలు పనికిరాదని తెలిపారు. ప్లెక్సీలను చించి వేసిన సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేశామని తెలిపారు.