గిద్దలూరు: గిద్దలూరు టిడిపి కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సోమవారం ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలపై ఇచ్చిన అర్జీలను పరిశీలించిన ఎమ్మెల్యే కొన్నిటిని వెంటనే పరిష్కరించడమే కాకుండా మరికొన్నిటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని అర్జీదారులకు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం సారథ్యంలో గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు పాల్గొన్నారు.