దర్శి: దర్శి పట్టణంలో వెలిసిన ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో జయంతి వేడుకలు
Darsi, Prakasam | May 11, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని మెయిన్ రోడ్డు లో వెలిసిన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా సుప్రభాత సేవతోటి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం 108 కలశాలతో అష్టోత్తర అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. తమలపాకుల అర్చన తర్వాత ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తుల స్వామి వారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.