యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం ఎస్సై పై తీవ్ర ఆరోపణలు చేసిన వైసీపీ నాయకులు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం ఎస్సై దేవకుమార్ పై వైసీపీ సోషల్ మీడియా నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల టిడిపి నాయకుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమపై కేసులు నమోదు చేసిన పోలీసులు టిడిపి సోషల్ మీడియాపై ఫిర్యాదు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తమకు అండగా వచ్చిన ఎమ్మెల్యేతో ఎస్ఐ ప్రవర్తించిన తీరు సరిగా లేదన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్లు పెడితే కేసులు నమోదు కావని ఎస్ఐ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు.