రాయదుర్గం: కదిరంపల్లి ఎస్సీ కాలనీలో కదలని వర్షపు నీరు, దుర్గంధంతో స్థానికుల ఇక్కట్లు #localissue
రాయదుర్గం మండలం కదిరంపల్లి ఎస్సీ కాలనీలో డ్రైనేజీ లేక ఇళ్లముందు మురుగునీరు నిలిచి దుర్గంధం వస్తోందని స్థానికులు తెలిపారు. వర్షం వస్తే నీరు ఇళ్లలోకి చేరి సరుకులు, దుస్తులు తడిసి ఇబ్బంది పడుతున్నామన్నారు. బయటకు రాలేని పరిస్థితి ఉందని, మురుగునీటి విషయంలో గొడవలు జరుగుతున్నాయన్నారు. అధికారులకు చెప్పినా పరిష్కారం కాలేదని వాపోయారు. విషయంపై ఎంపిడిఓ కొండన్న స్పందిస్తూ సమస్య పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.