రాయదుర్గం: జొన్నలు కొనుగోలు చేసి ఆదుకోండి మహాప్రభో అంటున్న బొమ్మనహాల్ రైతులు
బొమ్మనహాల్ మండల రైతులు జొన్న కొనుగోలు చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు ప్రారంభించినా కేవలం 4500 మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకుని నిలిపివేసింది. దీంతో సిద్దరాంపురం, కురువళ్ళి, హరేసముద్రం గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పండిన జొన్నలు కల్లాల్లోనే పురుగుపట్టి పాడవుతున్నాయి. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిగిలిన జొన్నలను వెంటనే కొనుగోలు చేయాలని వారు కోరారు.