యర్రగొండపాలెం: విశ్వనాధపురం గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించిన టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం విశ్వనాధపురం గ్రామంలో మంచినీటి సమస్యతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సమస్యను టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన స్పందించి పాత బోరు తొలగించి నూతన బోరు ఏర్పాటు చేశారు. వేసవిలో మంచినీటి సమస్య లేకుండా చూడాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో విశ్వనాధపురం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు