వికారాబాద్: దారూర్ మండల కేంద్రంలో మహాత్మ బసవేశ్వరుని విగ్రహ ఆవిష్కరణ, పాల్గొన్న ఎంపీ,స్పీకర్
నేటి యువత మహాత్మా బసవేశ్వరుని అడుగుజాడల్లో నడిస్తే సమాజం ఎంతో ఉన్నతంగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. కులమత వర్ణ భేదాలు లేని సమాజం కోసం అహర్నిశలు కష్టపడ్డ వ్యక్తి మహాత్మా బసవేశ్వరుడని అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా దారుర్ మండల కేంద్రంలో మహాత్మ బసవేశ్వరుని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.