వికారాబాద్: ఈనెల 21న కోస్గిల నిర్వహించే ముఖ్యమంత్రి కార్యక్రమానికి జిల్లా అధికారులు అందరూ అందుబాటులో ఉండాలి -కలెక్టర్
ఫిబ్రవరి 21న కోస్గిల్ నిర్వహించే రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమానికి జిల్లా అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా అధికారులను నిర్దేశించి అన్ని శాఖల అధికారులు ముఖ్యమంత్రి కార్యక్రమానికి హాజరుకావాలని అన్నారు.