రాయదుర్గం: పంచ్ ప్రభాకర్ పై పట్టణ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఆర్యవైశ్య సంఘం నాయకులు
ఆర్య వైశ్య కులస్తులను కించపరుస్తూ అసభ్యంగా మాట్లాడిన పంచ్ ప్రభాకర్ పై ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం ఆ సంఘం ముఖ్య నాయకులు రాయదుర్గం యూపీఎస్ పోలీస్ స్టేషన్‌లో సర్కిల్ ఇన్స్పెక్టర్ జయనాయక్ ను కలిశారు. పంచ్ ప్రభాకర్ పైన చట్టప్రకారం తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ పిర్యాదు ఇచ్చారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తాయి శేఖర్, మాజీ అధ్యక్షులు తాయి శ్రీనివాసులు, జయంతి సురేష్, బీసా శ్రీనివాసులు తదితరులు సిఐ ని కలసిన వారిలో ఉన్నారు.