విశాఖపట్నం: సింహాచలం ఆలయంలో వైభవంగా నిత్య కళ్యాణం
సింహాచలం శ్రీ వరహాల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నేడు నిత్య కళ్యాణ వేడుక జరిగింది. ఉత్సామూర్తి గోవిందరాజ స్వామికి అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.