దర్శి: తాళ్లూరు మండలంలోని ప్రధాన దేవాలయాలను పరిశీలించిన పోలీసు సిబ్బంది
Darsi, Prakasam | Apr 21, 2026 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని ప్రధాన దేవాలయాలను పోలీస్ సిబ్బంది పరిశీలించారు. భద్రత దృష్ట్యా సాధారణ విజిటింగ్ చేసినట్లు తెలిపారు. దేవాదాయ కమిటీలకు భద్రతకు సంబంధించిన సూచనలు జాగ్రత్తలు తెలియజేశామన్నారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.