గిద్దలూరు: మారిన చట్టాల ప్రకారం నిబంధనలు పాటించకపోతే వాహనదారులకు జరిమానా జైలు శిక్ష తప్పదని హెచ్చరించిన ఎస్సై కోటేశ్వరరావు
మారిన చట్టాల ప్రకారం నిబంధనలో పాటించకపోతే వాహనదారులకు భారీ జరిమాణాలు జైలు శిక్ష తప్పదని మార్కాపురం జిల్లా రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు అన్నారు. వాహనాలు నడిపే వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడంతో పాటు వాహన సంబంధిత దృక్పత్రాలు దగ్గర ఉంచుకోవాల్సిందేనన్నారు. వాహనం నడిపే వ్యక్తితో పాటు వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపితే కనీసం రూ.10 వేలు జరిమాలతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని ఎస్ఐ కోటేశ్వరరావు వాహనదారులను హెచ్చరించారు. కాబట్టి వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు.