మార్కాపురం: ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపిన అర్బన్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ చైతన్
మార్కాపురంలో ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అర్బన్ హాస్పటల్ వైద్యులు డాక్టర్ చేతన్ తెలిపారు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుందని అవసరమైతే తప్ప బయటికి రావద్దన్నారు. అధిక వేడి తీవ్రత వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉందని దీంతో చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయన్నారు. ఎక్కువగా ఓఆర్ఎస్ తగినంత నీటిని తీసుకోవాలన్నారు. అత్యవసర సమయాల్లో సమీప హాస్పిటల్ సంప్రదించాలన్నారు.