Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: బిఐఓపి స్పాంజ్ ఐరన్ పరిశ్రమ యాజమాన్యంపై ఓబులాపురం రైతుల నిరసన, భూములు తిరిగి ఇచ్చేయాలంటూ ధర్నా

Rayadurg, Anantapur | May 26, 2026
డి.హిరేహాల్ మండలం ఓబులాపురం సమీపంలోని బిఐఓపి స్పాంజ్ ఐరన్ పరిశ్రమ యాజమాన్యంపై ఓబులాపురం రైతులు నిరసనకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న తమ భూములు తిరిగి ఇచ్చేయాలంటూ మంగళవారం డి.హిరేహాల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, సంజీవప్ప, నాగార్జున తదితరులు మాట్లాడుతూ రైతులకు తీరని అన్యాయం చేసేలా పరిశ్రమ యాజమాన్యం వ్యవహరించిందని ఆరోపించారు. గ్రామస్తులు కాలుష్యం బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. రెవెన్యూ, కాలుష్య నియంత్రణ అధికారులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, రైతుల భూములు ఇప్పించాలన్నారు.