దర్శి: మల్లంపేట జడ్పీహెచ్ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్
Darsi, Prakasam | Apr 13, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ మండలం మల్లంపేట గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో 11 లక్షల రూపాయలతో దాత సహకారంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించి విద్యార్థులకు అంకితం చేశారు. కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి స్థానిక నాయకులు పాల్గొన్నారు.