దర్శి: బొద్దికూరపాడు గ్రామంలో మొహరం పండుగ సందర్భంగా చిన్న సరగత్ సంబరాలు
Darsi, Prakasam | Jun 23, 2026 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దుకూరపాడు గ్రామంలో మొహరం పండుగ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చిన్న సరగత్ సంబరాలు అంబరాన్ని అంటాయి. యుద్ధంలో వీరమరణం పొందిన హుస్సేన్ హసేన్ అబ్బాస్ త్యాగాలను స్మరించుకుంటూ కులమతాలకతీతంగా ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాలలో హిందూ ముస్లిం యువకుల కలిసి పండగను ఉత్సాహంగా జరుపుకున్నారు.