మార్కాపురం: సిద్దవరం పొలాలలో 11 కెవి విద్యుత్ వైర్లు తగిలి ఎనిమిది గేదలు మృతి
మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలంలోని సిద్దవరం గ్రామ పొలాలలో ఎనిమిది గేదలు మృతి చెందాయి. మేతకు పొలానికి వెళ్లిన గేదలు లెవెన్ కె.వి విద్యుత్తు లైన్ తీగలు తెగి కింద పడడంతో తగిలి విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాయి. దీంతో రైతులు లబోదిబోమన్నారు. ఒక గేద విలువ సుమారు 60 వేల రూపాయలు ఉంటుందన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.