యర్రగొండపాలెం: వైచర్లోపల్లిలో కళ్ళంలో ఆరబెట్టిన మిరప పంటపై గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఐదు లక్షలు నష్టం
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం వై చర్లపల్లి లో శనివారం రాత్రి దారుణ సంఘటన చోటుచేసుకుంది. కళ్ళంలో ఆరబెట్టిన మిరప పంటపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ సంఘటనలో సుమారు 20 క్వింటాల మిరప కాయలు కాలి బూడిద అయ్యాయి. సుమారు ఐదు లక్షలు నష్టం వాటిల్లిందని బాధిత రైతు చెంచయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై వెంకటరమణయ్య సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.