మార్కాపురం: బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ మహావిష్ణు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన చెన్నకేశవ స్వామి
మార్కాపురంలో వెలిసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా చెన్నకేశవస్వామి శ్రీమహావిష్ణువు అలంకారంలో గరుడ వాహనంపై పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ మహా విష్ణు సహస్రనామ పారాయణం, కోలాటంతో మహిళలు చిన్నారులు భక్తులను ఆకట్టుకున్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు