కొండపి: సింగరాయకొండ 16 నెంబర్ జాతీయ రహదారిపై డివైడర్ ని ఢీ కొట్టిన కారు, చెలరేగిన మంటలు నలుగురికి గాయాలు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ 16వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ ని ఢీ కొట్టి కారు బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురికి గాయాలు కావడంతో వారిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో నుంచి క్షతగాత్రులు బయటకు రాగానే కారులో మంటలు చెలరేగాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మరో ప్రమాదం జరగకుండా జాగ్రత్తపడ్డారు.