గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలోని ప్రశాంత్ నగర్ కు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి అదృశ్యం, గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ప్రశాంత్ నగర్ కు చెందిన జమ్మలమడుగు ప్రసాద్ అనే వ్యక్తి ఈనెల 10వ తేదీ నుంచి కనిపించడం లేదు. వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లిన ప్రసాద్ తిరిగి ఇంటికి రాలేదు. ఇప్పటికే కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో సమీప ప్రాంతాలలో అన్వేషించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తించినట్లయితే 9866199647, 7396691990 నంబర్లను సంప్రదించి సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.