మార్కాపురం: రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని వైసిపి నాయకులు మార్కాపురంలో భారీ సదస్సు
వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో మార్కాపురంలో భారీ సదస్సు ఏర్పాటు చేశారు. వైసీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అధ్యక్షత వహించారు. గత ప్రభుత్వంలో దాదాపుగా పూర్తయిన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు