రాయదుర్గం: రాయితీ విత్తన వేరుశనగ సద్వినియోగం చేసుకోండి : టిడిపి డి.హిరేహాల్ మండల అధ్యక్షులు కాదలూరు మోహన్ రెడ్డి
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి వ్యవసాయ ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం సబ్సిడీపై వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేస్తుందని టీడీపీ మండల అధ్యక్షులు కాదలూరు మోహన్ రెడ్డి అన్నారు. గురువారం డి.హీరేహాల్ మండలంలోని కాదలూరు, గొడిశలపల్లి తదితర గ్రామాల్లో వ్యవసాయ అధికారులతో కలిసి రైతులకు వేరుశెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఒక్క పట్టాదారు పాసుపుస్తకానికి 3 ప్యాకెట్ల వేరుశెనగ రూ.5,508 విలువతో పంపిణీ చేస్తున్నామని వివరించారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.