రాయదుర్గం: చెత్త కంపోస్టు డంపింగ్ యార్డు సమస్య కు పరిష్కారం చూపాలి : వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మెట్టుగోవిందరెడ్డి
రాయదుర్గం పట్టణంలో చెత్త కంపోస్టు డంపింగ్ యార్డ్ కాలుష్యం బారిన పడి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మెట్టుగోవిందరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆ పార్టీ మాజీ కౌన్సిలర్ లు, ముఖ్య నాయకులతో కలిసి డంపింగ్ యార్డు పరిశీలించారు. తరచూ చెత్త కు నిప్ప పెట్టడంతో పొగ, విషవాయువుల దాటికి ఇళ్లల్లో ఉండలేకపోతున్నామని, చర్మ వ్యాధులు, ఆయాసం బారిన పడుతున్నామని స్థానికులు మెట్టుగోవిందరెడ్డి వద్ద ఏకరువు పెట్టారు.