రాయదుర్గం: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరవేస్తాంహ: నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ మెట్టుగోవిందరెడ్డి
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందని ఏపిఐఐసి మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మెట్టుగోవిందరెడ్డి మండిపడ్డారు. శనివారం రాయదుర్గం పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ తరపున పని చేసి పదవీకాలం పూర్తి చేసుకున్న కౌన్సిలర్ లకు సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్ధేశం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటుతామని ప్రకటించారు.