గిద్దలూరు: కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్లో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికీ గాయాలయ్యాయి, ఆసుపత్రికి తరలింపు
మార్కాపురం జిల్లా కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్లో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు స్పందించి గాయపడ్డ వారిని కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలించారు. ప్రమాదంపై సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.