కొండపి: సింగరాయకొండ లోని ఓ ప్రైవేటు వైద్యశాలలో వైద్యం కోసం వెళ్లి బుజ్జి అనే వ్యక్తి మృతి, దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు
సింగరాయకొండలోని ఓ ప్రైవేటు వైద్యశాలలు షుగర్ చెక్ చేపించుకునేందుకు వెళ్లిన బుజ్జి అనే వ్యక్తి అనుమానస్పద మృతి చెందాడు. ఆదివారం ఉదయాన్నే ఆసుపత్రికి వెళ్ళగా షుగర్ చెక్ చేసిన వైద్యులు ఒక ఇంజక్షన్ చేశారు. కొద్దిగా సేపటికి బుజ్జి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు వైద్యం నిర్లక్ష్యంతో తమ కుటుంబ సభ్యులు మృతి చెందాడని ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.