గిద్దలూరు: గిద్దలూరు ఎస్టి కాలనీలోని అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎస్టి కాలనీలోని అంగన్వాడి కేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించి రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత ప్రభుత్వం అంది రేషన్ చిన్నారులకు చిన్నారుల తల్లులకు, గర్భిణీ స్త్రీలకు పూర్తిస్థాయిలో అందాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అంగన్వాడీలకు సూచించారు. తర్వాత చిన్నారులతో సరదాగా గడిపారు.