తాడిపత్రి: 45 మైనర్ల ద్విచక్ర వాహనాలను సీజ్ చేసాం: తాడిపత్రిలో అర్బన్ సీఐ ఆరోహణరావు
జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా గత రెండు రోజులుగా స్టాప్ మైనర్ డ్రైవింగ్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టామని తాడిపత్రి అర్బన్ సీఐ ఆరోహణరావు చెప్పారు. తాడిపత్రి అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఆయన మాట్లాడారు. రెండు రోజుల్లో మొత్తం 45 మైనర్ల ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామన్నారు. మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. ఇకమీదట రోడ్డు నిబంధనలు పాటించక పోయినా, మైనర్లు వాహనాలను డ్రైవ్ చేసినా, తాగి వాహనాలను నడిపినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.