దర్శి: ముండ్లమూరు మండలం పూరిమెట్ల గ్రామంలో పోలేరమ్మ తల్లి తిరుణాలలో పోటెత్తిన భక్తులు
Darsi, Prakasam | Jun 25, 2026 ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పురిమెట్ల గ్రామంలో పోలేరమ్మ తల్లి తిరుణాల భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తిరునాళ్ల సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రామ మహిళలు నైవేద్యాలను సిద్ధం చేసుకుని డప్పు వాయిద్యాల మధ్య పురవీధులలో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్యం సమర్పించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తులతో కిక్కిరిసిపోయి సందడి వాతావరణం నెలకొన్నది.