గిద్దలూరు: కొమరోలు మండలంలో మే 19వ తేదీ మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో మే 19వ తేదీ మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని కసిన పల్లె విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో మరమ్మతులు, నూతన విద్యుత్ లైన్ల నిర్మాణం కారణంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు గృహ, వ్యవసాయ సంబంధిత విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.