రాయదుర్గం: పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ 119 వ జయంతి వేడుకలు
మాజీ ఉప ప్రధాని, దళితుల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రామ్ 119 జయంతి వేడుకలు రాయదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు బండికృష్ణమూర్తి, జిల్లా అధికార ప్రతినిధి పసుపులేటి నాగరాజు, పద్మశాలి కార్పోరేషన్ డైరెక్టర్ పొరాళ్ల పురుషోత్తం, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున, నియోజకవర్గ అధ్యక్షులు ఆనంద్ సీనియర్ నేత గ్యాస్ కృష్ణ, పూజారి తిప్పయ్య, చిన్నికృష్ణ, బిటిపి రామాంజనేయులు, కేడిమి తిప్పేస్వామి, కావలి రవి, పైతోట అంజి, తదితరుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ప్రతినబూనారు.