రాయదుర్గం: మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోభివృద్ధి : మాజీ ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి
మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని ప్రపంచ వేదికపై గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించడంలో ఆయన కీలకపాత్ర పోషించారని BJP రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ MLA కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల సుపరిపాలన సందర్భంగా రాయదుర్గం పట్టణంలోని ప్రసిద్ధ దశ భుజ మహాగణపతి ఆలయంలో బుధవారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. మోదీకి ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, కౌన్సిలర్ లు వన్నూరప్ప, డిష్ గోవిందు, BJP సీనియర్ నాయకులు జివి నాయుడు, కళ్యం సురేష్, వాల్మీకి పవన్, హరిత పాల్గొన్నారు.