యర్రగొండపాలెం: మురికి మల్లా సమీపంలోని జాతీయ రహదారిపై సిమెంటు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం మురికి మల్ల సమీపంలోని జాతీయ రహదారిపై సిమెంటు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న డ్రైవర్ క్లీనర్ కు స్వల్ప గాయాలయి బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఈవే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో లారీని పక్కకు తొలగించారు. ఈ ఘటనతో వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని పోలీసులు సూచించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.