యర్రగొండపాలెం: దోర్నాల మండలం కొత్తూరు గ్రామానికి చెందిన టిడిపి నాయకులు నాగిరెడ్డి ని పరామర్శించిన టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు గ్రామానికి చెందిన టిడిపి నాయకులు దుగ్గంపూడి నాగిరెడ్డి ఇటీవల ట్రాక్టర్ రోటవేటర్ ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసినదే. ఈ విషయం తెలుసుకున్న టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు కూటమి నాయకులతో కలిసి ఆయన ఇంటికి వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొని ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.