యర్రగొండపాలెం: త్రిపురాంతకం మండలంలోని నాసర్ రెడ్డి నగర్ ఎంపీపీ స్కూల్లో పాము కలకలం
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం నాసర్ రెడ్డి నగర్ లోని ఎంపీపీ స్కూల్లో అయిదు అడుగుల పాము దొరింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. వెంటనే ఉపాధ్యాయులు స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న స్నేక్యాచారి మల్లికార్జున పామును పట్టుకుని విద్యార్థులకు అవగాహన కల్పించారు. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.