రాయదుర్గం: పట్టణంలో తాగనీటి సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు
రాయదుర్గం పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్ అధికారులను స్థానిక ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు ఆదేశించారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ దివాకర రెడ్డి, డిఈ సురేష్, ఏఈ నరసింహులు, ఫిట్టర్లు, లైన్ మెన్ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నీటి సరఫరాలో ప్రజల నుంచి వస్తున్న పిర్యాదులు గుర్తు చేస్తూ వారికి తగిన ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా వేసవిలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.