మార్కాపురం: జిల్లా కేంద్రంలోని అన్నా క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా కేంద్రంలోని అన్నా క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలకు వడ్డిస్తూ ఆప్యాయంగా పలకరించారు. ఆహార పదార్థాలు ఎలా ఉన్నాయని వారిని అడిగి తెలుసుకున్నారు. శుభ్రత నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా నాణ్యతతో కూడిన భోజనం కల్పించాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు