దర్శి: దర్శి పట్టణంలో గాలివాన బీభత్సం సృష్టించింది, కరెంట్ అంతరాయం కలగడంతో అంధకారంలో గడిపిన స్థానికులు
ప్రకాశం జిల్లా దర్శి లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. విపరీతమైన గాలులు ఉరుములు మెరుపులతో భయభ్రాంతులకు గొలిపేలా వర్షం కురిసింది. దీంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి కరెంటు లేకపోవడంతో అంధకారంలోనే గడిపామని స్థానికులు తెలిపారు.