గిద్దలూరు: కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా, పదిమందికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడ్డ సంఘటన శనివారం చోటుచేసుకుంది. ప్రమాదంలో దాదాపు పది మంది గాయపడ్డారు. వీరందరిని 108 అంబులెన్స్ లో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై సమాచారాన్ని అందుకున్న స్థానిక ఎస్సై నాగరాజు సంఘటనా స్థలానికి చేరుకొని జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ వారిలో ఆరు మందికి తీవ్ర గాయాలు కాగా మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు మొత్తం 15 మంది ఆటోలో ఉన్నట్లుగా తెలుస్తోంది.