యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో నిరుపయోగంగా మారిన పాల శితలికరణ, ఇబ్బందులు పడుతున్న పాడి రైతులు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో పాలశితలీకరణ కేంద్రం నిరుపయోగంగా మారింది. దీంతో పాడి రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పాలశితలికరణ కేంద్రం లేకపోవడంతో తక్కువ ధరకే పాలను విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పాడి రైతులంటున్నారు. పనిచేయకపోవడంతో అందులో ఉన్న పరికరాలని తుప్పుబట్టి పనికి రాకుండా పోయే పరిస్థితి ఏర్పడిందని రైతులన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.