కళ్యాణదుర్గం: దురదగుంట గ్రామంలో ఎమ్మెల్యే చొరవతో తాగునీటి సమస్య పరిష్కారం
కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారమైంది. గ్రామంలో గత కొంతకాలంగా తాగునీటి ఎద్దడి నెలకొంది. ఈ విషయాన్ని గ్రామస్తులు ఎమ్మెల్యే సురేంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే స్పందించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సమ్మర్ యాక్షన్ ప్లాన్ టీం సభ్యుల పర్యవేక్షణలో మంగళవారం రాత్రి బోరు ఏర్పాటు చేయించారు. దీంతో తాగునీటి సమస్య పరిష్కారమైంది. గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.