దర్శి: రైతులు ప్రతి ఒక్కరు ఫార్మా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించిన దొనకొండ ఏవో బాలకృష్ణ నాయక్
Darsi, Prakasam | May 21, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని రైతులకు మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ నాయక్ పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మా యాప్ ప్రతి రైతు మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అందులో వ్యవసాయ సాగుకు సంబంధించిన సూచనలు, ప్రభుత్వం కల్పిస్తున్న వ్యవసాయ పథకాలను తెలుసుకోవచ్చా అన్నారు. సమీపంలోని రైతు సేవా కేంద్రాలను రైతుల సంప్రదించాలని కోరారు.