మార్కాపురం: రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గాను సందర్శించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి రాజస్థాన్ లోని అజ్మీర్ ఖాజా మొహినుద్దీన్ దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లా నియోజకవర్గంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చాదర్ సమర్పించినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు సహకారంతో త్వరలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అవ్వాలని దర్గాలో ప్రార్థనలు చేశామన్నారు.