దర్శి: మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించాలని రైతు సంఘం సిపిఐ నాయకులు డిటి దేవప్రసాద్ కు వినతి
ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మార్వో కార్యాలయంలో మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ రైతు సంఘం సిపిఐ నాయకులు డిటి దేవప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు కోటేశ్వరరావు మాట్లాడుతూ మొక్కజొన్నకు క్వింటాకు 2,500 ధర కల్పించాలన్నారు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నాదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.