కొండపి: సింగరాయకొండ పట్టణంలోని ట్రంక్ రోడ్డులో నిలిచిపోయిన వర్షపు నీరు, ఇబ్బందులు పడుతున్న స్థానిక వాహనదారులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో శుక్రవారం కురిసిన వర్షానికి ట్రంకు రోడ్డు పూర్తిగా నీటితో నిండిపోయింది.ప్రస్తుతం ఇక్కడ రోడ్ల విస్తరణ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్లే వర్షం కురిసిన ప్రతిసారీ ఈ పరిస్థితి పునరావృతమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.