గిద్దలూరు: గిద్దలూరులో సీఎం సభకు వచ్చి మృతి చెందిన రవి కుటుంబానికి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రూ.2 లక్షలు ఆర్థిక సహాయం
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం క్రిష్టం శెట్టిపల్లి సీఎం చంద్రబాబు నిన్న పర్యటించిన విషయం విధితమే.. సీఎం సభకు వచ్చిన శ్రీరామ్ రవి అనే కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు. గుండెపోటుకు గురైన క్రమంలో తోటి కార్యకర్తలు శ్రీరామ్ రవిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి దృష్టికి రావడంతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రవి స్వగ్రామమైన బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామానికి వెళ్లి రవి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తక్షణ సహాయం కింద వ్యక్తిగతంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రూ.2 లక్షలు అందించారు.