గిద్దలూరు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బహిరంగంగా మద్యం తాగుతున్న యువకులకు జరిమానాలు వేధించిన పోలీసులు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో శుక్రవారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బహిరంగంగా మద్యం తాగుతున్న యువకులను గుర్తించి వారిని మందలించడమే కాకుండా జరిమానా విధించారు. అంతేకాకుండా మద్యం తాగుతున్న ప్రాంతాలను వారితోనే శుభ్రం చేయించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో బహిరంగంగా మద్యం తాగుతున్న వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు జరిమానా విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బహిరంగంగా ఎవరు కూడా మద్యం తాగవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.